Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కుమార్తెకు మళ్లీ పెళ్లి.. వరుడు ఎవరంటే...

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (14:58 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య మళ్లీ పెళ్లి కుమార్తె కానుంది. ఆమెకు వచ్చే నెలలో రెండో పెళ్ళి జరుగనుంది. ఒక బిడ్డ తల్లిగా ఉన్న సౌందర్యకు తొలుత 2010లో తొలిసారి వివాహమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌తో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరికి వేద్ కృష్ణ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా గత 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 
 
అప్పటినుంచి సౌందర్య ఒంటరిగానే ఉంది. దీంతో ఆమెకు రెండో పెళ్లి చేయాలని రజినీకాంత్ నిర్ణయం తీసుకుని, కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విశాగన్ వనంగమూడి అనే వరుడును ఎంపిక చేశారు. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. వీరి వివాహం వచ్చే నెల 11వ తేదీన జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందులోభాగంగా 9వ తేదీన మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహిస్తారు. చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఈ వేడుకలు జరుగున్నాయి. 
 
కాగా, విశాగన్‌కు కూడా ఇది రెండో వివాహమే. ఆయన వంజగర్ ఉలగమ్ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. సినిమాలతో పాటు ఆయన ఫార్మాస్యూటికల్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇక సౌంద‌ర్య‌ కూడా ఇటు దర్శకురాలిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. కెరీర్ తొలినాళ్ళ‌లో గ్రాఫిక్ డిజైన‌ర్‌గా ప‌ని చేసింది సౌంద‌ర్య‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments