Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మహానటి'కి బంపర్ ఛాన్స్...

Advertiesment
'మహానటి'కి బంపర్ ఛాన్స్...
, గురువారం, 17 జనవరి 2019 (14:59 IST)
తెలుగులో 'మహానటి' చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈమె ఇపుడు లక్కీ ఛాన్స్ కొట్టేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ - ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "పేట". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అదేసమయంలో రజినీకాంత్ తన తదుపరి చిత్రంపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా, మురుగదాస్ చెప్పిన కథకు ఆయన ఫిదా అయిపోయారు. ఇది పూర్తి ఫాంటసీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే, ఈ కథకు సూపర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నెల్ రావాల్సివుంది. 
 
ఇదిలావుంటే ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటించనుందనే వార్త కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కీర్తి ఓ మలయాళ చిత్రంలో నటిస్తుండగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలోనూ ఆమె నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్త కూడా ఊహాగానమే. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవ్వుల పువ్వులతో పాటు కాసుల వర్షం కురిపిస్తున్న "ఎఫ్-2"