Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రుద్రమదేవి''ని దాటేసిన భాగమతి.. స్వీటీకి రజనీకాంత్ కితాబు

స్వీటీ, అనుష్క నటించిన తాజా సినిమా భాగమతి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాదిలో లేడి ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన భాగమతికి భారీ స్పందన రావడం ఇదే తొలిసారి అని సినీ పండితులు అంటున్నారు. ప్రస్తుతం భాగ

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (17:56 IST)
స్వీటీ, అనుష్క నటించిన తాజా సినిమా భాగమతి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాదిలో లేడి ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన భాగమతికి భారీ స్పందన రావడం ఇదే తొలిసారి అని సినీ పండితులు అంటున్నారు. ప్రస్తుతం భాగమతి ''రుద్రమదేవి'' కలెక్షన్లను కుమ్మేసింది.

భాగమతి సినిమా విడుదలైన తొలివారంలోనే రూ.20కోట్ల భారీ మొత్తం వసూలైంది. రుద్రమదేవి సినిమా అమెరికాలో రూ.9.80 డాలర్లు వసూళ్లు సాధించగా, భాగమతి పది మిలియన్ డాలర్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. 
 
ఇకపోతే.. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా విడుద‌లైన భాగమతి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇలా వసూళ్లు సృష్టించగా, ఈ చిత్రంపై విమర్శకులే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన అగ్రతారలు కూడా భాగమతిని కొనియాడుతున్నారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మగధీర చెర్రీ కూడా భాగమతి సినిమా మైండ్ బ్లోయింగ్‌‌గా వుందంటూ ట్వీట్ ద్వారా కితాబిచ్చాడు. ఇందుకు స్వీటీ కూడా మా కష్టాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు అంటూ రీ ట్వీట్ చేసింది.
 
అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఫోన్ ద్వారా స్వీటికీ శుభాకాంక్షలు తెలిపారు. భాగమతిలో అదరగొట్టావంటూ కితాబిచ్చారు. కాగా అనుష్క లింగా సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments