జూలైలో రజనీకాంత్ రాజకీయ పార్టీపై ప్రకటన.. సూపర్ స్టార్ సోదరుడు సత్యనారాయణ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఖరారైపోయింది. సినీ స్టార్లు రాజకీయ నేతలుగా అవతరించిన తమిళనాడులో మరో సినీతార రాజకీయ నాయకుడిగా మారనున్నారు. ఆయన ఎవరో కాదు.. రజనీకాంత్. కోడంబాక్కం రాఘవేంద్ర కళ్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఖరారైపోయింది. సినీ స్టార్లు రాజకీయ నేతలుగా అవతరించిన తమిళనాడులో మరో సినీతార రాజకీయ నాయకుడిగా మారనున్నారు. ఆయన ఎవరో కాదు.. రజనీకాంత్. కోడంబాక్కం రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో ఫోటో షూట్ చేసిన రజనీకాంత్.. మరో ఫోటో షూట్ కార్యక్రమాన్ని జూలైలో ప్లాన్ చేశారట.
ఈ విషయాన్ని రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ బెంగళూరులో చెప్పారు. జూలై తొలి లేదా రెండో వారంలో రజనీకాంత్ పార్టీ గురించి ప్రకటన వుండవచ్చునన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ''కాలా'' సినిమా షూటింగ్ మే 29 వరకు ముంబైలో జరుగనుంది. ఈ షూటింగ్ పూర్తయ్యాక జూలై తొలివారంలో మళ్లీ రజనీకాంత్ ఫ్యాన్స్‌తో భేటీ అవుతారని.. ఈ సందర్భంగా రాజకీయ పార్టీపై ప్రకటన వుండవచ్చునని సత్యనారాయణ వెల్లడించారు.
మే 15 నుంచి 19 వరకు దాదాపు ఐదురోజులపాటు ఇప్పటికే చెన్నైలో అభిమానులతో భేటీ అయిన సందర్భంగా రాజకీయాలపై రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారు. ఇంకా తాను రాజకీయాల్లోకి రానున్నానని పరోక్షంగా చెప్పేశారు. ఇక పార్టీపై ప్రకటనే తరువాయి. అలా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. తమిళ రాష్ట్రంలోని అనిశ్చితికి తెరపడే అవకాశం ఉందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.