Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలి సీక్వెల్ సెట్స్‌పైకి.. రజనీకాంత్ లుక్ ఎలా ఉంటుందో..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి బాక్సాఫీసును షేక్ చేసింది. తమిళనాట కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ దేశాల్లోని అభిమానులు కూడా కబాలికి బ్రహ్మరథం పట్టారు. దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కి

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (13:22 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి బాక్సాఫీసును షేక్ చేసింది. తమిళనాట కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ దేశాల్లోని అభిమానులు కూడా కబాలికి బ్రహ్మరథం పట్టారు. దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. రజనీకాంత్ ఫ్యాన్స్ అంచనాల మధ్య ఈ ఏడాది జులై 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కబాలి' కథాపరంగా ఆకట్టుకోలేకపోయినా.. రజనీ స్టయిల్ మాత్రం సూపర్భ్‌గా ఉందనే కామెంట్స్ వినిపించాయి.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ తయారు కానుంది. ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే దర్శకుడు పా. రంజిత్ కబాలి సీక్వెల్ స్క్రిప్ట్‌ని పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే దర్శకుడు రంజిత్ సూపర్ స్టార్ రజనీ, ధనుష్‌తో కలసి రజనీ లుక్‌పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
కబాలిలో రజనీ లుక్కే హైలైట్ అయిన నేపథ్యంలో.. సీక్వెల్‌లోనూ డిఫరెంట్ స్టయిల్‌లో రజనీకాంత్ కనిపిస్తాడని తెలుస్తోంది. మరోవైపు రోబో సీక్వెల్ '2.ఓ' షూటింగ్ ని పూర్తి చేసుకొన్నాడు రజనీ. ప్రస్తుతం '2.ఓ' డబ్బింగ్ పార్ట్‌ని పూర్తి చేస్తున్నారు. ఇక, కబాలి సీక్వెల్ వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లనుంది. కబాలి సీక్వెల్‌లో రజనీకాంత్ లుక్ ఎలా ఉంటుందనే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

ఏపీలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments