Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ "2.O" మేకింగ్ వీడియో లీక్... డైరెక్టర్ శంకర్ షాక్...

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "2.O". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. రెండు నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ఇపు

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (16:31 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "2.O". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. రెండు నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ఇపుడు యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్టు గత యేడాదే విడుదల కావాల్సివుంది. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. నవంబర్ 29వ తేదీన చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమాపై భారీ అంచనాలు పెంచిన టీం గతంలో పలు పోస్టర్స్ రిలీజ్ చేసింది. 
 
కానీ ఇప్పటివరకు టీజర్ విడుదల చేయలేదు. దీంతో అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి లీక్ అవుతున్న క్లిప్‍లని చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
 
ముఖ్యంగా, 2.0 పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మూవీకి సంబంధించి ఏదో ఒకటి బయటకి వస్తుంది. తాజాగా బిబిసి ఛానల్ 2.0 సినిమాపై డాక్యుమెంటరీ తీస్తుంది. 
 
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన 2.0 మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో హీరోయిన్ అమీ జాక్సన్ సెట్‌లో సరదాగా స్టెప్స్ వేస్తూ అల్లరి చేస్తుంది. అలాగే, మరికొంతమంది టెక్నీషియన్స్ ఆమెకు సూచనలిస్తూ కనిపించారు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments