Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్' షో హోస్ట్‌గా విజయ్ దేవరకొండ..?

తెలుగు చిత్రసీమలో విజయ్ దేవరకొండ ఒక సంచలనమనే చెప్పుకోవాలి. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఒక్క చిత్రంతో అర్జున్ రెడ్డికి యువప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. చిత్ర వర్గాల్లో కూడా పరిశ్రమలో ఫుల్

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (14:55 IST)
తెలుగు చిత్రసీమలో విజయ్ దేవరకొండ ఒక సంచలనమనే చెప్పుకోవాలి. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఒక్క చిత్రంతో అర్జున్ రెడ్డికి యువప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. చిత్ర వర్గాల్లో కూడా పరిశ్రమలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తాజాగా గీత గోవిందం సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. 
 
గీత గోవిందం సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతుండటంతో విజయ్ ఆనందానికి అవధుల్లేవట. చిన్న బడ్జెట్ సినిమాలను కూడా బాక్సీఫీస్ వద్ద భారీ విజయం వచ్చేలా చేస్తున్నాడు ఈ యంగ్ తరంగ్. డిఫెరెంట్ నటనతో ఇప్పుడున్న యువ హీరోలలోనే నెంబర్ ఒన్‌గా నిలుస్తున్నాడు విజయ్. ఇలా కెరీర్ మొదట్లోనే మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌కు కళ్ళు చెదిరే ఆఫర్ మరొకటి వచ్చిందట. 
 
తెలుగు బుల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షోగా నడుస్తున్నది బిగ్ బాస్. ఈ షోకు మొదట్లో ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు రెండవ షోకు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ 3 కోసం ఇప్పటికే విజయ్ దేవరకొండను నిర్ణయించేశారట. మొదట్లో బిగ్ బాస్ షోలో 2వ ఎపిసోడ్‌కు నానికి బదులు విజయ్‌ను అడిగారట. అయితే గీత గోవిందం సినిమాలో బిజీగా ఉండటంతో రానని తేల్చేశారట విజయ్. కానీ ఇప్పుడు మూడవ షోలో తాను హోస్ట్‌గా వెళ్ళేందుకు సిద్థంగా ఉన్నట్లు విజయ్ చెప్పారట. మూడవ షోకు హోస్ట్‌గా విజయ్ దేవరకొండ వస్తే ఆ షోకు ప్రజల నుంచి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది. రెమ్యునరేషన్ కూడా బాగా ఎక్కువే విజయ్ అడుగుతున్నట్లు సమాచారం. అయితే ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్థంగా ఉన్నారట.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments