Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్బందికరంగా రాజశేఖర్ ఆరోగ్యం, వైద్యులు ఏం చెప్తున్నారు?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (20:13 IST)
ఐదు రోజుల కిందట సీనియర్ హీరో రాజశేఖర్ తనతో పాటు భార్య జీవిత ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మికలకు కరోనావైరస్ బారిన పడ్డట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. శివాని శివాత్మిక ఇద్దరూ కరోనా నుంచి కోలుకోగా.. తను జీవిత ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు రాజశేఖర్ తెలిపారు. అయితే రాజశేఖర్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు తాజాగా ఆయన చిన్నకూతురు శివాత్మిక గురువారం ట్విట్టర్లో వెల్లడించడంతో టాలీవుడ్లో ఆందోళన నెలకొంది.
 
మరోవైపు రాజశేఖర్ అభిమానులు కూడా కంగారుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్న సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేసింది. రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించిన ఆ ఆస్పత్రి.. ఆయనను వెంటిలేటర్ పైన ఉంచినట్లు తెలిపింది.
 
ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ వుండి శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నపుడు పెట్టే నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్‌ను ప్రస్తుతం రాజశేఖర్‌కు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. మరోవైపు రాజశేఖర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని క్షేమంగా తిరిగిరావాలని చిరంజీవి ఆకాంక్షిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు

Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

తర్వాతి కథనం
Show comments