Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక వృద్ధపాత్రలకే పరిమితం కానున్న రజనీ కాంత్?

కబాలి సినిమాలో వృద్ధ మాపియా నేత పాత్రలో నటించి దక్షిణాది ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్ కబాలీ చిత్ర దర్శకుడు రంజిత్ షా దర్సకత్వంలోనే నటిస్తున్నారు. కబాలికి లాగే ఈ చిత్రంలో కూడా రజనీ వృద్ధ పాత్రలోనే నటించనున్నట్లు సమాచారం.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (06:24 IST)
కబాలి సినిమాలో వృద్ధ మాపియా నేత పాత్రలో నటించి దక్షిణాది ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్ కబాలీ చిత్ర దర్శకుడు రంజిత్ షా దర్సకత్వంలోనే నటిస్తున్నారు. కబాలికి లాగే ఈ చిత్రంలో కూడా రజనీ వృద్ధ పాత్రలోనే నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆరుదశాబ్దాల జీవితం పూర్తి చేసిన రజనీకాంత్ యువకుడి పాత్రల్లో నటించి డ్యాన్సులు చేయడం ఆరోగ్య కారణాల రీత్యా కూడా సరికాదన్నది సన్నిహితుల అభిప్రాయం. దాంతో పవర్ పుల్ పాత్రలను తేలికగా సాగించే వృద్ధ పాత్రలపై రజనీ ఆసక్తి చూపుతున్నారని వీరంటున్నారు. 
 
తాజా చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటి విద్యాబాలన్‌ నటించనున్నారు. ‘కబాలి’ చిత్రం తర్వాత మళ్లీ రంజిత్‌ పా దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించే అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని ధనుష్‌ వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ సంస్థ రూపొందిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ మే నెలలో ప్రారంభం కానున్నట్లు, ఇందులో రజనీకి జంటగా బాలివుడ్‌ నటి విద్యాబాలన్‌ నటించవచ్చనే సమాచారం వెలువడింది. దీనిగురించి విద్యాబాలన్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి.
 
కబాలి చిత్రంలో మొదట్లో రజనీకి జంటగా నటించేందుకు విద్యాబాలన్‌తో చర్చలు జరిపారు. అయినప్పటికీ, అప్పట్లో కాల్షీట్లు కుదరలేదు. దీంతో ఆ చిత్రావకాశం రాధికా అప్టేను వరించింది. ప్రస్తుతం మళ్లీ రజనీతో నటించే అవకాశం విద్యాబాలన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments