Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను గౌరవంగా చూసేలా నా కుమారుణ్ణి పెంచుతా: స్నేహ ప్రతిజ్ఞ

తన జీవితంలో ఈరోజు ఒక చిన్న అడుగు వేస్తున్నానని, చిన్నదే కానీ అది చాలా ముఖ్యమైన అడుగు అంటూ ఆడవారిని గౌరవించేలా, వారి పట్ల హుందాగా వ్యవహరించేలా తన కొడుకును పెంచుతానని స్నేహ చెప్పారు

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (03:37 IST)
మలయాళ నటి భావనపై లైంగిక వేధింపు వార్తలు చూసి చలించిపోయిన సినీ నటి స్నేహ.. తల్లిగా అందరికీ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నారు. తన జీవితంలో ఈరోజు ఒక చిన్న అడుగు వేస్తున్నానని, చిన్నదే కానీ అది చాలా ముఖ్యమైన అడుగు అంటూ ఆడవారిని గౌరవించేలా, వారి పట్ల హుందాగా వ్యవహరించేలా తన కొడుకును పెంచుతానని స్నేహ చెప్పారు. తల్లిగా ఇది నా ప్రతిజ్ఞ అని మహిళలు గౌరవంగా బతికే హక్కుకోసం, ఆ హక్కులను సాధించుకునే గెలుపుకోసం తన కుమారుడిమీదే ప్రయోగం చేస్తానని, మహిళలను అగౌరవించని పెంపకంతో వాడిని తీర్చిదిద్దుతానని స్నేహ అందరికీ మాట ఇచ్చారు.
 
సేలంలో ఐదుగురు వ్యక్తులు కలసి పదేళ్ల అమ్మాయిని వేధించి చంపేశారు. తమిళనాడులో ఏం జరుగుతోంది? ప్రతి రోజూ వార్తల్లో ఇలాంటివి కనిపించడం కామన్‌ అవుతుందా?? దయచేసి ఈ దుర్మార్గాలను ఆపండి అంటూ స్నేహ ఈ సందర్భంగా పిలుపిచ్చారు. 
 
ఇటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలనే నిర్ణయం తీసుకోవడానికి ఇంతకు మించిన తరుణం లేదు. మహిళల గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి.. అంతకు ముందు ఉన్నట్టు మేము సురక్షితంగా ఉన్నామని మహిళలు ధైర్యంగా ఉండడానికి పొరాటం చేయవలసిన సమయమిదే. ముఖ్యంగా... పసిపాపలను అబ్యూజ్‌ చేయడానికి కూడా ఏ మగాడైనా భయపడాలి. మనసులో అలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. న్యాయవ్యవస్థను పటిష్టం చేయాలి.
 
నిర్భయ, నందిని, రితిక, హాసిని... ఇంకా ఎంతమంది? ఇక ఈ దేశంలో బాధితులు ఉండకూడదు. మాకు న్యాయం కావాలి. మాకు గౌరవం కావాలి. గౌరవంగా బతికే హక్కు కావాలి. మా హక్కులను సాధించుకునే గెలుపు కావాలి. ఈ సందర్భంగా నేనొక చిన్న అడుగు వేస్తున్నాను. చిన్నదే కానీ చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఓ తల్లిగా నేనో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ‘మహిళలను గౌరవంగా చూసేలా.. మహిళల అర్హతకు తగ్గట్టు వాళ్లతో హుందాగా ప్రవర్తించేలా’ నా కుమారుణ్ణి పెంచుతానని అందరికీ మాటిస్తున్నాను.
 
ఈ పవిత్ర భారత దేశంలో ఇంటా బయటా ప్రతి రోజూ, ప్రతి క్షణ ఆడదాన్ని అంగాంగాన్ని చూపులతో, చేష్ట్యలతో, హింసాయుత ప్రవర్తనతో నలిపేస్తున్న మగాడి మగతనాన్ని సరైన పునాదుల మీద నిలిపేలా ఇంటినుంచే ఆ మార్పును తన కొడుకు ద్వారా తీసుకువస్తానని ప్రతిక్ష చేస్తున్న స్నేహతో ఏకీభవిద్దామా? స్నేహ నిర్ణయం, ప్రతిజ్ఞ ఒక ఆదర్శం కాదని ఈ దేశంలోని సగం జనాభాపై మగపిల్లలందరూ ప్రదర్శించాల్సిన కనీస మానవీయ బాధ్యత అని అంగీకరిద్దామా? 
 
 ఈ దేశంలో నిజమైన విప్లవాన్ని తన ఇంటినుంచే మొదలెడతానంటున్న స్నేహ ప్రకటనను రెండు చేతులతో స్వీకరిద్దాం. ఒకప్పుడు ఈ దేశంలో మగాళ్లమంతా ఇళ్లలో సమాజంలో స్నేహ చెబుతున్న విధంగానే పెరిగాం. కానీ ఇప్పుడు కట్టు తప్పిపోయాం. ఈ అపప్రథ, ప్రపంచం యావత్తు మనల్ని చూసి చేస్తున్న పరిహాసపు చేష్ట్యలనుంచి ఇకనైనా దూరమవుదాం. మన పూర్వీకులు, మన తాతలు, తండ్రులు నేర్పగా మనం అర్ధాంతరంగా వదిలేసిన ఆ గొప్ప సంస్కృతిని మళ్లీ మనలో నిలుపుకునేందుకు ఈ క్షణం నుంచే మొదలెడదామా?
 

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం