Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉంది: దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించారు. 'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని వ

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (08:46 IST)
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించారు. 'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. దర్శకుడు క్రిష్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. 12 కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తెరకెక్కించారని కొనియాడారు. రచయిత సాయిమాధవ్‌ సంభాషణలు, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తెలుగు చిత్రాల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అజరామరంగా నిలుస్తుందని రాజమౌళి అన్నారు. 
 
కాగా, బాలకృష్ణ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగానే గురువారం ఉదయం 5.15గంటలకు కూకట్‌పల్లి భ్రమరాంభ థియేటర్‌లో బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ షోకి బాలయ్యతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, క్రిష్, నటుడు నారా రోహిత్ హాజరయ్యారు. 
 
తెలుగు వాడి ప్రతిభను చాటే చిత్రంగా గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కింది. ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్థరాత్రి నుండే టిక్కెట్ల కోసం అభిమానులు థియేటర్స్ దగ్గర క్యూ కట్టారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌ని చిరు ఫుల్‌ఎంటర్‌టైన్ చేయగా, నందమూరి అభిమానులను బాలయ్య మరింత అలరిస్తాడని చెప్పుకుంటున్నారు. 
 
అంజనాపుత్ర క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన శాతకర్ణి చిత్రం గత రికార్డులు చెరిపేయనుందని అంటున్నారు. సంక్రాంతి పండుగకే ముందే శాతకర్ణి చిత్రంతో తమకు పెద్ద పండుగను బాలయ్య తీసుకొచ్చాడంటూ అభిమానులు అల్లర్లతో థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏంది బొంగులో అరెస్ట్ చేసేది నువ్వు, నా వెంట్రుక కూడా పీకలేవు: పేర్ని నాని

Amberpet: కాపీ కొట్టి దొరికిపోయారు.. టీచర్, పారెంట్స్ తిట్టారని ఇంటి నుంచి వెళ్ళిపోయారు..

బాలుడి ముక్కు రంధ్రంలో పాము.. 9 నుంచి 10 సెంటీ మీటర్లు.. ఎలా తొలగించారంటే?

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య

పాకిస్థాన్‌లో 13ఏళ్ల బాలిక హత్య.. చాక్లెట్ దొంగలించందనే డౌట్‌తో కొట్టి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments