Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియ‌న్ కంటెంట్‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ చేయ‌నున్న రాజ‌మౌళి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (20:41 IST)
animatiion still
రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా పూర్త‌య్యాక అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తున్నారు. లైవ్ యానిమేష‌న్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్ద‌నున్నారు.ఇప్ప‌టికే దీనికి సంబంధించిన క‌థ కూడా సిద్ధ‌మ‌యింద‌ని క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ తెలియ‌జేశారు.మ‌న‌దేశంలో యానిమేష‌న్ సినిమాలు కొన్ని వ‌చ్చాయి.అయితే అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో పోలిస్తే త‌క్కువేన‌ని చెప్పాలి. అందుకే డిస్నీ సంస్థ రూపొందించిన యానిమేష‌న్ సినిమాల‌కు మంచి గుర్తింపు వుంది.
 
ప్ర‌స్తుతం ఆ త‌రహాలో తెలుగు ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి చేర్చాల‌ని రాజ‌మౌళి టీమ్ నిర్ణ‌యించింది. గ‌తంలో ఈగ‌, బాహుబ‌లి సినిమాల‌ను ఆ సినిమాలు విడుద‌ల‌య్యాక యామినేష‌న్ కూడా చేశారు. కానీ ఈసారి చేయ‌బోయే లైవ్ యానిమేష‌న్ ఇండియ‌న్ కంటెంట్‌తో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో వుంటుంద‌ని తెలుస్తోంది. కాగా, ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర్వాత మ‌హేష్‌బాబుతో ఓ సినిమా వుంటుంద‌ని వార్త కూడా ఆ చిత్ర నిర్మాత కె.ఎల్‌. నారాయ‌ణ చెప్పారు. కానీ క‌థ ఇంకా సిద్ధం అయిందేలోదే తెలీదు. అంతా సిద్ధం అయ్యాక చెప్పండి అని కూడా ఆయ‌న అన్నారు. ఇక మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట త‌ర్వాత మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌య్యాడు. క‌నుక గేప్ చాలా వుంటుంది క‌నుక ఈలోగా లైవ్ యానిమేష‌న్ చేయ‌వ‌చ్చ‌న‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments