Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండ, వాన‌, చ‌లి, ప‌గ‌లు, రాత్రి అనే తేడాలేకుండా పని చేస్తున్న "ఆర్ఆర్ఆర్" టీమ్

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (09:47 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అక్టోబరు 13వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ చిత్రం ద్వారా తన దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రాల రికార్డులను బద్ధలుకొట్టాలన్న కాంక్షతో రాజమౌళి పనిచేస్తున్నారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం ఎపుడో విడుదల కావాల్సివుంది. కానీ, పలు కారణాల రీత్యా వాయిదాపడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబ‌ర్ 13న సినిమా విడుద‌ల కావ‌డం ప‌క్కా అని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా మేక‌ర్స్ ఎండ, వాన‌, చ‌లి, ప‌గ‌లు, రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్ చేస్తున్నారు.
 
తాజాగా మాసివ్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుండగా, దానికి సంబంధించిన ఏర్పాట్ల‌పై ఓ వీడియోని విడుద‌ల చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తుండ‌గా, ఎన్టీఆర్ కొమురం భీంగా అల‌రించ‌నున్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments