Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరకు మాటలు వస్తే.. రాఘవేంద్రరావు పొగడ్తకు రాజమౌళి ఫిదా

చిత్ర సమర్పకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రం చూశాక మాటల్లేవు. వెండితెరకు మాటలు వస్తే... ‘నాపై ఇంత అద్భుతాన్ని ఆవిష్కరిస్తారనుకోలేదు’ అంటూ ఆశ్చర్యపోతుంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అదృష్టవంతులు. ఈ ట్రైలర్‌ని ప్రత

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (04:10 IST)
‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ప్రచార చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా సంస్థ తెరకెక్కించింది. శోభు యార్లగడ్డ. ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. ఏప్రిల్‌ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ప్రచార చిత్రం ఆవిష్కరణ సందర్భంగా... చిత్ర సమర్పకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రం చూశాక మాటల్లేవు. వెండితెరకు మాటలు వస్తే... ‘నాపై ఇంత అద్భుతాన్ని ఆవిష్కరిస్తారనుకోలేదు’ అంటూ ఆశ్చర్యపోతుంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అదృష్టవంతులు. ఈ ట్రైలర్‌ని ప్రతీరోజూ పదిసార్లయినా చూస్తా’’ అన్నారు. 
 
‘‘వర్షానికి ముందు ఉరుములు వస్తాయి. ట్రైలర్‌ కూడా ఉరుములాంటిదే. సినిమా విడుదల అయినప్పుడే వాన పడినట్టు. ఆ ధారలో తడిసినప్పుడే నిజమైన ఆనందం. ఏప్రిల్‌ 28 తరవాత అలాంటి అనుభూతి కలుగుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు సంగీత దర్శకుడు కీరవాణి. 
 
‘‘ఐదేళ్ల ప్రయాణం ఇది. ఇప్పుడు ముగింపు దశకు వచ్చాం. ‘బాహుబలి’ ఫ్రాంఛైసీ ఇక ముందు కూడా కొనసాగుతుంద’’ని శోభు యార్లగడ్డ చెప్పారు. ‘‘ప్రేక్షకులు వూహించనిదానికంటే అద్భుతంగా ఉంటుందీ చిత్రమ’’ని ఛాయాగ్రాహకుడు సెంథిల్‌ తెలిపారు. ‘‘బాహుబలి 2’ ఎప్పుడొస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికంటే మేము ఇంకా ఎక్కువ ఆత్రుతతో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాం’’ అన్నారు నటుడు సుబ్బరాజు. 
 
రానా మాట్లాడుతూ ‘‘నటుడిగా ఏడేళ్లు పూర్తయ్యాయి. అందులో ఐదేళ్లు ‘బాహుబలి’ టీమ్‌తోనే సరిపోయింది. మాహిష్మతీ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏప్రిల్‌ 28న చూడబోతున్నాం. ఇంత గొప్ప చిత్రంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంద’’న్నారు. 
 
‘‘ప్రచార చిత్రం చాలా బాగుంది. ఐదేళ్ల కష్టాలన్నీ ఈ ఒక్క ట్రైలర్‌తో మర్చిపోయాం. రెండు పాత్రలు పోషించినా అమరేంద్ర బాహుబలి పాత్ర కోసమే ఎక్కవగా కష్టపడ్డా. రాజమౌళి అన్ని ఎమోషన్లనీ చక్కగా తీస్తారు. అయితే రొమాన్స్‌ విషయంలోనే కాస్త వీక్‌. ఈ విషయం ఆయనకి చాలాసార్లు చెప్పా. ‘బాహుబలి 2’లో కొన్ని షాట్స్‌ చూస్తే... ఆ లోటు కూడా తీరిపోయిందనిపించింది. ఇప్పుడు రాజమౌళిలో ఒక్క మైనస్‌ కూడా లేద’’న్నారు ప్రభాస్‌. కార్యక్రమంలో కమల్‌కణ్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments