Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరేంద్ర బాహుబలి అను నేను...ప్రభాస్ జన్మ ధన్యమైందా?

బాహుబలి సినిమాతో ప్రభాస జన్మ ధన్యమైందనే చెప్పాలి. అయిదేళ్ల అమూల్యమైన సమయాన్ని రాజమౌళి చేతుల్లో పెట్టిన ప్రభాస ఒక జీవితానికి సరిపడిన కాన్వాస్‌ను తన చుట్టూ గీసుకున్నాడు. ముంబైలో గురువారం నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ, రెండే

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (03:55 IST)
ఒకటి మాత్రం నిజం. బాహుబలి సినిమాతో ప్రభాస జన్మ ధన్యమైందనే చెప్పాలి. అయిదేళ్ల అమూల్యమైన సమయాన్ని రాజమౌళి చేతుల్లో పెట్టిన ప్రభాస ఒక జీవితానికి సరిపడిన కాన్వాస్‌ను తన చుట్టూ గీసుకున్నాడు. ముంబైలో గురువారం నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ, రెండే రెండు మాటలన్నాడు. థ్యాక్స్ రాజ్.. దర్శక మాంత్రికుడు రాజమౌళికి ప్రభాస్ చెప్పిన రెండు ముక్కల హృదయపూర్వక కృతజ్ఞత అది.
 
ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ప్రచార చిత్రం వచ్చేసింది. 140 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ వస్తూ వస్తూ ‘బాహుబలి 2’పై అంచనాల్ని మరింతగా పెంచేసింది. ‘‘అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహీష్మతీ ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అనే ప్రభాస్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు తావిచ్చిన కట్టప్ప బాహుబలిని కత్తితో పొడిచిన షాట్‌ కూడా ఇందులో ఉంది. 
 
కొండంత ఏనుగు తలపై నుంచి కారుతున్న నీటి ధార లాంటి దృశ్యాలతో మరో కొత్తలోకంలోకి తీసుకెళ్లారు రాజమౌళి. మాహీష్మతీ సామ్రాజ్యం, రాజదర్బార్‌, వేలాది సైన్యం, వాళ్లతో యుద్ధం, ఏనుగులు, గుర్రాలూ, బాణాలు అన్నింటికి మించిన భావోద్వేగాలు.. ట్రైలర్‌లో కనిపించాయి. ‘‘నువ్వు నా పక్కనుండేంత వరకూ నన్ను చంపే మగాడు ఇంత వరకూ పుట్టలేదు మామా’’ అంటూ ప్రభాస్‌ కట్టప్పని ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌... ఈ ప్రచార చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్‌ - రానా నువ్వా నేనా అంటూ తలపడే షాట్‌తో ప్రచార చిత్రాన్ని ముగించారు. 
 
ఇక ఏప్రిల్ 28. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల జన్మ ధన్యమయ్యే రోజు. బాహుబలి 2 సినిమా విడుదలయ్యే రోజు. ఈ సినిమా చూడ్డానికిైనా బతికుండాలి అని కోట్లాదిమంది కోరుకుంటున్న రోజు. బాలివుడ్ కాదు హాలీవుడ్ చిత్ర నిర్మాణానికి నిజమైన సవాల్ విసరనున్న రోజు. 
 
అంతవరకూ బాహుబలి సినిమా ట్రైలర్‌ను చూస్తూనే ఉందాం.
 
కరణ్‌ చేతికి కట్టప్ప కత్తి
‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ముంబయి వెళ్లింది. అక్కడ హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌ జోహార్‌కి ఓ అరుదైన బహుమానం అందజేసింది ‘బాహుబలి’ టీమ్‌. కట్టప్ప బాహుబలిని పొడిచిన కత్తిని కరణ్‌కి బహుమానంగా ఇచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments