Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని పని అయిపోయింది, ఇక రాజ్ తరుణ్ వంతు వచ్చింది

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:12 IST)
డిఫరెంట్‌ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్‌ రామకృష్ణ, జోహార్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా రిలీజైంది.
 
అదే కోవలో యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన రొమ్‌కామ్‌ ఒరేయ్‌ బుజ్జిగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్‌, హెబ్బాపటేల్‌ హీరోయిన్స్‌గా నటించారు.
 
కుమారి 21 ఎఫ్‌లో సూపర్బ్‌ కెమిస్ట్రీతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది.
 
అభిమాన అగ్ర తారలు నటించిన క్లాసికల్‌ లైబ్రరీ ఆహా సొంతం. అందుకనే... అతి తక్కువ సమయంలో ఆహా తనదైన స్థానాన్ని సొంతం చేసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్‌ఘోష్‌, అన్నపూర్ణమ్మ‌, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వి సినిమా రిలీజ్ తో నాని పని అయిపోయింది. మరి.. ఇప్పుడు రాజ్ తరుణ్ వంతు వచ్చింది. ఈ సినిమా ఏ స్ధాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments