Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊటీలో హీరో రాజ్ దాసిరెడ్డి ద్విభాషా చిత్రం కోసం సన్నాహాలు

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (17:38 IST)
Raj Dasireddy
ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొంది చెప్పుకోదగ్గ విజయం సాధించిన "భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు" హీరోగా పరిచయమైన యువ కథానాయకుడు రాజ్ దాసిరెడ్డి. యిప్పుడు  ఓ ద్విభాషా చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఊటీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ విభిన్న ప్రేమ కథా చిత్రం కోసం ఊటీలో ఇప్పటివరకు షూటింగ్ చేయని అత్యద్భుత లోకేషన్లు అన్వేషిస్తున్నారు.

"భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు" విజయానంతరం రాజ్ దాసిరెడ్డికి తెలుగులో పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ... అదే సమయంలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం రావడంతో తెలుగు అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోయాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటూ అమెరికాలోని "న్యూయార్క్"లో ఉండిపోవాల్సి వచ్చింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న సదరు ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లేందుకు మరింత సమయం పడుతుండడంతో ఈలోపు ఓ ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రాజ్ దాసిరెడ్డి. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments