Webdunia - Bharat's app for daily news and videos

Install App

దున్నపోతుల్లా కొట్టుకుంటూ వుండండి... మోదీ చూస్తుంటారు... ఆర్‌.నారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తిరుప‌తిలో ప్ర‌క‌టించ‌డం... ఆ త‌ర్వాత మాట మార్చ‌డం తెలిసిందే. ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం ఎంత‌గా పోరాటం చేస్తున్నా... కేంద్ర‌ ప్ర‌భుత్వం మాత

Webdunia
గురువారం, 3 మే 2018 (11:54 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తిరుప‌తిలో ప్ర‌క‌టించ‌డం... ఆ త‌ర్వాత మాట మార్చ‌డం తెలిసిందే. ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం ఎంత‌గా పోరాటం చేస్తున్నా... కేంద్ర‌ ప్ర‌భుత్వం మాత్రం స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌రం. రోజురోజుకు ప్ర‌త్యేక హోదాపై నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి.  పీపుల్ స్టార్ ఆర్‌.నారాయణమూర్తి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... "ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పారు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. 
 
పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలి. అవి లేని నాడు వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నారు. ఈ సందర్భంగా నేను రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ప్రత్యేక హోదా కోసం ఫైట్‌ చేస్తోంటే, మరికొంతమంది మరోలా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే, రెండు కోడిపుంజుల్లా.. రెండు పొటేళ్లలా.. రెండు దున్నపోతుల్లా కొట్టుకుంటుంటే.. మీరూ మీరూ కొట్టుకుని చావండి, మేమెందుకు ఇస్తాం ప్రత్యేక హోదా? అని కేంద్ర ప్రభుత్వం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటోంది అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. 
 
మనకు సిగ్గుచేటు.. కాబట్టి ఓ ఆంధ్రప్రదేశ్‌ బిడ్డలారా.. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ముందుగా మీ జెండాలు పక్కన పెట్టండి. ప్రత్యేక హోదా సాధనే మీ అజెండాగా ఏకం కండి అంటూ పీపుల్ స్టార్ పిలుపు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments