Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్.కె. సాగర్ చిత్రం ది100 ఎలా వుందంటే... రివ్యూ

దేవీ
శుక్రవారం, 11 జులై 2025 (18:53 IST)
R.K. Sagar's film The100
నటీనటులు : ఆర్ కె సాగర్, మిషా నారంగ్, విష్ణు ప్రియ, ధన్య బాలకృష్ణ, తారక్ పొన్నప్ప, ఆనంద్, కళ్యాణి నటరాజన్, వంశీ నెక్కంటి, వివి గిరిధర్, టెంపర్ వంశీ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : శ్యామ్ కే నాయుడు, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాత : రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జె.తారక్ రామ్, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్.
 
ఆర్కే సాగర్ కమ్ బ్యాక్  ఫిల్మ్ 'ది 100'. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న అనగా నేడు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ : విక్రాంత్ (ఆర్ కె సాగర్)  ఐపిఎస్ ఆఫీసర్. సిటీలో వరుసగా జరుగుతున్న దోపిడీలు, హత్యలకు సంబంధించిన కేసును ఆయనకు పై అధికారులు అప్పగిస్తారు. ఈ హత్యలు ఒకేరీతిలో జరుగుతుంటాయి. కానీ, ఆర్తి (మిషా నారంగ్) ఈ నేరాలకు బాధితురాలిగా మారడంతో ఈ కేసును పర్సనల్‌గా తీసుకుంటాడు విక్రాంత్. ఈ నేరాల వెనుక ఏదో పవర్‌ఫుల్ శక్తులు ఉన్నట్లు ఆయన గ్రహిస్తాడు. అనంతరం జరిగిన పరిణామాలతో మధు(విష్ణు ప్రియ) రాకతో కఠినంగా మారుతాయి. అసలు ఈ మధు ఎవరు? అసు హత్యలు ఎవరు చేశారు? అనేవి తెలియాలంటే సమీక్షలోకి వెళదాం.
 
సమీక్ష:
మొగలిరేకులు సీరియల్ తర్వాత షాది ముబారక్ వంటి సినిమాలు చేసినా సరైన సక్సెస్ లేదు. ఇప్పుడు వచ్చిన ది 100 సినిమా కాస్త లెట్ అయిన లేటెస్ట్ గా వచ్చి మెప్పించాడనే చెప్పాలి. మిస్టరీ నేపథ్యంలో సాగిన ఈ సినిమా కథ మొదటినుంచి ఏ మాత్రం బోరు కొట్టకుండా చాలా ఇంటరెస్టింగా తీసాడు దర్శకుడు శ్రీధర్. గంట ముప్పై అయిదు నిముషాల సినిమాని చాలా క్రిస్పీగా ఎంగేజింగ్గా తీసాడు సినిమా. కాగా, ఇంటర్వెల్ అయినప్పుడు ఏంటి అప్పుడే బ్రేకా.. అనిపిస్తుంది.
 
సస్పెన్స్ మెయింటైన్ చెయ్యడం దానికి తగ్గ చిక్కు ముడులు ప్రేక్షకుడు ఊహించని విధంగా సస్పెన్స్ బ్రేక్ చెయ్యడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.  డైరెక్టర్ శశిధర్ తను అనుకున్న కథను డీల్ చేసిన విధానం,  ఆయన ఆలోచనకు తగ్గట్టుగా కెమెరామెన్  అట్మాస్ఫియర్  క్రియేట్ చెయ్యడం దానికి తోడుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథను ఎన్హన్స్ చేసింది. మొత్తానికి 24క్రాఫ్ట్స్ పై ఫుల్ కమాండ్ తో నడిపించాడు దర్శకుడు.
 
కాగా, ఈ చిత్ర కథతో గతంలో పలు సినిమాలు వచ్చినా ఇది కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండటం, కథలో ఉండాల్సిన టెన్షన్‌ను త్వరగా ముగించేయడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. కథనంలో మరింత రక్తికలిగేలా చూసుకుంటే బాగుండేది. కొన్ని సీన్స్ క్రుతంగా అనిపిస్తాయి. సినిమాలో వచ్చే రొమాంటిక్ సాంగ్ కథకు బ్రేక్ అని చెప్పాలి. కొన్ని సీన్స్‌లో ఎమోషనల్ టచ్ ఉన్నా వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మెప్పించదు.
 
సినిమాలోని నటీనటుల విషయంలో మరి కాస్త జాగ్రత్త పడాల్సింది. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల విషయంలో మెరుగైన యాక్టర్స్ ని తీసుకోవాల్సింది. క్లైమాక్స్‌లో ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించినా, దాన్ని రొటీన్‌గానే ముగించేశారు. హీరో/హీరోయిన్ పాట బోర్ గా లేకపోయిన ప్రేక్షకుడి మూడ్ పాట పై ధ్యాస కన్నా కథపైనే  ఉంది.
 
సాగర్ నటన పాత్ర ఔచిత్యం బాగా సూటయింది. రౌడీలను చేజ్ చేస్తూ అమ్మాయిని రేప్ చేసింది ఇతనే అని తెలిసాక వాడ్ని కొట్టే సీన్లో ప్రేక్షకుల ఫీలవుతారు. చాలా కాలం తర్వాత పోలీసు పాత్రతోమెప్పించాడు. హీరోయిన్ బాగా జీవించింది ....బాగా స్లిమ్ గా ఉండి ఈ తరం జనరేషన్ కిడ్గా ఉంది. సాగర్కి అసిస్టెంట్ గా నటించిన గిరిధర్ బాగా హుషారుగా కనిపించాడు. హీరో ఫ్రెండ్ ధన్య బాలకృష్ణ బాగా చేసి జీవించింది. హీరోయిన్ తండ్రి పాత్రలో ఆనంద్ కూడా జీవించాడు.
 
‘ది 100’ చిత్రం క్రైమ్ యాక్షన్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంటుంది.అయితే ఊహించగలిగే కథనం, స్లో పేస్, గ్రిప్పింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలతో మెలో డ్రామాగా వుంది. అయినా సస్పెన్స్ చిత్రాల ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనే చెప్పాలి.
రేటింగ్: 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments