Webdunia - Bharat's app for daily news and videos

Install App

'క్వీన్‌'గా రమ్యకృష్ణ .. ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (10:19 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వీటితోపాటు వెబ్ సిరీస్‌లను కూడా పలువురు రూపొందిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన కంగనా రావత్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న "తలైవి" చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇపుడు టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తున్న వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను లీక్ చేశారు. 
 
ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో జ‌య‌ల‌లిత బాల్యాన్ని చూపిస్తూ, ట్రైల‌ర్‌ని డిసెంబ‌రు ఐదో తేదీన విడుద‌ల చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.
 
అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌య‌ల‌లిత పాత్ర పోషిస్తున్న ర‌మ్య‌కృష్ణ ఫేస్ రివీల్ చేయ‌లేదు మేక‌ర్స్‌. తాజాగా జ‌య‌లలిత పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 
 
ఇందులో ర‌మ్య లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. 'క్వీన్' అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ రూపొందుతుండ‌గా, ఎంఎక్స్ ప్లేయర్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. తెలుగు, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ వెబ్ సిరీస్‌ని మ‌నం వీక్షించ‌వ‌చ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments