Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప' సక్సెస్ మీట్ : హిందీ వెర్షన్ కలెక్షన్స్ ఇవే...

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (13:33 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' చిత్రం సక్సెస్ మీట్ మంగళవారం హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. ఇందులో చిత్ర బృందం సభ్యులంతా పాల్గొని ఈ చిత్రాన్ని ఇంతటి ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఈ చిత్రం కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. 
 
అలాగే, ఇందులో మంగళం శీనుగా విలన్ పాత్రలో కనిపించిన హాస్య నటుడు సునీల్ మాట్లాడుతూ, విలన్ పాత్రల కోసం సినిమా పరిశ్రమకు వచ్చానని, కానీ, హాస్య నటుడుగా, హీరోగా నటించాల్సివచ్చిందన్నారు. 
 
తన చిరకాల కల మాత్రం ఇన్నేళ్ళకు నెరవేరిందన్నారు. పైగా, ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియా విలన్‌గా తనను పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. 
 
ఇకపోతే, ఈ నెల 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లు ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా హిందీలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. శుక్రవారం రూ.2.31 కోట్లు, శనివారం రూ.3.75 కోట్లు, ఆదివారం రూ.4.25 కోట్లు, సోమవారం రూ.2.75 కోట్లు చొప్పున కలెక్షన్స్ వచ్చాయి. 
 
ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.39.95 కోట్లను రాబట్టిందని నిర్మాతలు వివరించారు. అలాగే, దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోందని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. టాలీవుడ్‌లో మరో పెద్ద చిత్రం విడుదలయ్యేంత వరకు పుష్ప సినిమా రికార్డుల హోరు కొనసాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments