Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారేడుపల్లి అడవుల్లో పుష్ప చిత్ర యూనిట్: వందల మంది ఫైటర్లతో..?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (22:33 IST)
సూపర్ హిట్ అందుకున్న ఆర్య, ఆర్య 2 మూవీల తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో మూవీతో వస్తున్నాడు. అదే.. పుష్ప మూవీ.. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కూడా. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. భారీ అంచనాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. మలయాళం స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటించనున్నారు.
 
అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ఈ మూవీలో కీ రోల్స్ పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2021 డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ రోజున పుష్ప మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి అయ్యింది.
 
కాగా.. ఫైనల్ షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. ఈ అడవులలో చిత్ర బృందం కొన్ని కీలక సీన్లను చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్, వందల మంది ఫైటర్లతో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్లను షూట్ చేస్తున్నారు. 
 
మారేడుపల్లి అడవుల్లో పుష్ప చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. సెప్టెంబర్ ఆఖరి వరకు షూటింగ్ అక్కడే జరుగనుంది. అక్టోబర్ నెలలో ఈ మూవీ షెడ్యూల్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించనున్నారు దర్శకనిర్మాతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

డిప్రెషన్ కారణమట.. 45 రోజుల పసికందును గొంతుకోసి చంపేసిన తల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments