జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో సోమవారం భారత్‌కు స్వర్ణపతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో భారత మహిళా షూటర్ అవని లేఖారా గెలుపొందారు. ఫలితంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
పారా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా అవని లేఖారా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ పోటీల్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి.
పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవని లేఖారాను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. నిజంగా ఇది భారత క్రీడా రంగానికి స్పెషల్ మూమెంట్ అని మోడీ ట్వీట్ చేశారు.