Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ది బ్లాక్ బస్టర్" విభాగంలో "పుష్ప" ప్రదర్శన

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:06 IST)
హీరో అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ కె.సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం పుష్ప. గత యేడాది ఆఖరులో విడుదలై ఇప్పటికీ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన అవకాశాకాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మకంగా భావించే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో బ్లాక్ బస్టర్ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శనకు నోచుకుంది. తద్వారా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. 
 
తిరుపతి శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. కరోనా రెండో దశ అల తర్వా విడుదైంది. సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రీమియర్ కాబడిన తర్వాత 'పుష్ప' సినిమా రీచ్ మరింత పెరిగింది. "తగ్గేదేలే" అంటూ బన్నీ పలికిన డైలాగులు, పుష్పరాజ్‌గా అతని మేనరిజమ్స్ గట్టి ప్రభావం చూపించాయి. 
 
అయితే ఇప్పుడు ప్రతిష్టాత్మక 44వ మాస్కో ఫైల్మ్ ఫెస్టివల్‌లో 'పుష్ప' పార్ట్-1ను స్క్రీనింగ్ చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రపంచవ్యాప్తంగా 'బ్లాక్ బస్టర్స్' కేటగిరీ కింద ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
ఈ ట్వీట్‌ను హీరో అల్లు అర్జున్ షేర్ చేశారు. "పుష్ప - ది రైజ్ - పార్ట్ -1 చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ బ్లాక్ బస్టర్ హిట్స్ విభాగంలో ఎంపిక చేసినందుకు సంతోషిస్తున్నాం" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments