Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (12:11 IST)
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప-2 చిత్రం వచ్చే నెల ఐదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఆ ట్రైలర్‌ను ఆదివారం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా వేదికగా రిలీజ్ చేశారు. స్థానిక గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ వేడుకకు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులతో పాటు నిర్మాతలు, చిత్ర బృందం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ట్రైలర్ గ్రాండ్ సక్సెస్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఒక దక్షిణాది మూవీకి ఉత్తరాదిలో ఈ తరహాలో భారీ ఈవెంట్ జరగటం చెప్పుకొదగ్గ విషయంగా చెప్పుకుంటున్నారు. ట్రైలర్ అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకునేలా మేకర్స్ కట్ చేశారు. అయితే ఫ్యాన్స్‌ను పక్కన పెడితే.. మిగతా వారికి పుష్ప 2 ట్రైలర్ ఎందుకో పెద్ద కిక్ ఇవ్వలేదనే ప్రచారం సాగుతుంది. ట్రైలర్‌పై రాజమౌళి డేవిడ్ వార్నర్ మొదలు రిషబ్ శెట్టి, హరీష్ శంకర్, అనీల్ రావిపూడి, బాబీ, హను రాఘవపూడి లాంటి వారు  స్పందించారు. ట్రైలర్ అదిరిపోయిందంటూ ట్వీట్స్ చేశారు. 
 
అల్లు అర్జున్, సుకుమార్‌తో తమకుండే "మైత్రి" కోసమో సినిమా వారు పొస్ట్‌లు వేయటం కామన్.. కానీ నెటిజెన్స్ రెస్పాన్స్ మాత్రం "పుష్ప 2'' ట్రైలర్‌పై భిన్న కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌తీ ఫ్రేమ్ భారీగా, ప్ర‌తీ డైలాగ్‌‌లో హీరో ఆటిట్యూడ్‌ హైలైట్ అయ్యేలా చూపిన విధానం ఎందుకో కేజిఎఫ్‌నే గుర్తు చేసిందని‌, పుష్ప 2 ప్రమోషనల్ పోస్టర్స్ మొదలు.. ట్రైలర్‌లోని కొన్ని షాట్స్ వరకు ప్రతిది కేజిఎఫ్ ఫార్మాట్‌ను దింపారనే చర్చ సోషల్ మీడియాలో సాగుతుంది. 
 
దీనికి తోడు ట్రైలర్‌లో పెళ్లాం మాట వింటే ఎలా ఉంటుందో అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. నంద్యాల ఎపిసోడ్‌ను గుర్తుచేసిదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక 'పుష్ప 2' కోసం చాలా మంది సంగీత డైరెక్టర్లు పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 'పుష్ప 2' ట్రైలర్‌కి మాత్రం ప్రతీ ఫ్రేమ్‌కి తానే బీజీఎం ఇచ్చానని, తాను ఒక్కడినే ఈ ట్రైలర్‌కు బీజీఎం ఇచ్చుకున్నాను అని చెప్పుకునే పరిస్థితికి దేవిశ్రీ ప్రసాద్‌కు వచ్చారు. 
 
ప్రస్తుతం పుష్ప 2 కోసం తమన్‌తో పాటు, అజనీష్, శ్యామ్ సీఎస్ కూడా వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియాల్సివుంది. ఇక 'పుష్ప 2' ట్రైలర్‌పై టాక్ డివైడ్‌గా ఉన్నా, ‌ట్రోలింగ్ నడుస్తున్నా.. ఊర మాస్ డైలాగులతో బీసీ సెంటర్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉంది. 'పుష్ప' అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్, పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్, పుష్ప అంటే ప్లవర్ కాదు వైల్డ్ ఫైర్' అనే డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. 
 
ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గురించి ముందు నుంచి టీమ్ సోషల్ మీడియాలో ప్రమోషనల్ క్యాంపైన్ చేయటం, అల్లు అర్జున్,  రష్మిక మందన్నలు ప్రత్యేక విమానంలో పాట్నా చేరుకున్న విజువల్స్‌తో పాటు పాస్‌ల కోసం అభిమానుల ఎగబడటం లాంటి వీడియోలను క్రియేట్ చేసి వదలటంతో ట్రైలర్ లాంఛ్‌కు జనాలను మోబిలైజ్ చేయటం ద్వారా ఈవెంట్‌ను సక్సెస్ చేయగలిగారనే టాక్ వినిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

రౌడీ షీటర్ బోరుగడ్డకు ఠాణాలో వీఐపీ ట్రీట్మెంట్ - భయ్యా టీ అంటూ ఆర్డర్ వేయగానే...

మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం.. వైరల్ అవుతున్న వీడియో (video)

చడీచప్పుడుకాకుండా గనుల రెడ్డికి బెయిల్ ఇచ్చేశారు.. అభ్యంతరం చెప్పని ఏసీబీ

ఏపీకి పొంచివున్న మరో తుఫాను.. 23న అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments