Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

Advertiesment
pushpa

ఠాగూర్

, ఆదివారం, 17 నవంబరు 2024 (22:12 IST)
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం "పుష్ప 2". "పుష్ప 1"కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్‌గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన "పుష్ప 2" ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్‌గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ హాజరు కావడం జరిగింది. సుమారు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్ జరగటం విశేషం. 
 
ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ, "పాట్నా ప్రజలందరికీ నమస్కారం. ఇంతటి అభిమానాన్ని మేము పాట్నా నుండి అస్సలు ఊహించలేదు. ఒకరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఈ చిత్రం ఇంతటి విజయవంతమైన ప్రయాణం కావడానికి ముఖ్య కారణం అయిన స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్. అంతేకాకుండా చిత్రంగా పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేసారు. దానికి నాకు ఎంత సంతోషంగా ఉంది. అల్లు అర్జున్ ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తితో పనిచేయడం మాకు ఇంత సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈవెంట్ ఇంతటి విజయం సాధించడానికి ముఖ్య కారణం పాట్నా పోలీసులు. ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి పేరుపేరునా ధన్యవాదాలు" అన్నారు. 
 
మైత్రి మూవీ మేకర్ రవి మాట్లాడుతూ, "మేము ఇప్పటికీ ఎన్నో చిత్రాలను చేశాము. ఎన్నో ఈవెంట్స్ కూడా చేశాము. కానీ ఒక ట్రైలర్‌ను ఇలా విడుదల చేయడం అనేది మొదటిసారిగా జరుగుతుంది. పాట్నా నుండి ఇంతటి అభిమానాన్ని మేము ఊహించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. డిసెంబర్ 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత పది సంవత్సరాల్లో ఇంతటి పెద్ద ఈవెంట్ చూడటం ఇదే తొలిసారి" అన్నారు. 
 
చిత్ర డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని మాట్లాడుతూ, "ఈ చిత్రానికి ఇంతటి జనాదరణ పొందడం ఎంతో సంతోషకరంగా ఉంది. అల్లు అర్జున్ ఇటువంటి చరిత్రను సృష్టించారు. ఇదే నేను థియేటర్లో కూడా చూడాలనుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ రవికి, నవీన్‌కి ధన్యవాదాలు. మీరు పాట్నాలో ఈ ఈవెంట్‌తో ఎలా అయితే ఈ ఈవెంట్‌తో చరిత్రను సృష్టించారో, ఈ చిత్రం కూడా అలాగే చరిత్రను సృష్టించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి పెద్ద ఈవెంట్‌ను నేను చూడటం ఇదే మొదటిసారి. అందుకుగాను కారణం అయిన అల్లు అర్జున్‌కు నా ధన్యవాదాలు" అన్నారు. 
 
బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ మాట్లాడుతూ, "పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని బీహార్‌లోని పాట్నాలో నిర్వహించడం నాకు ఎంత సంతోషంగా ఉంది. బీహార్ ప్రభుత్వం తరఫున అలాగే ముఖ్యమంత్రి గారి తరపున చిత్ర బృందానికి మా కృతజ్ఞతలు అందజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం ఇలా విజయం సాధించడానికి తోడ్పడిన పోలీసులు, అభిమానులు అందరూ కలను, కళాకారులను సపోర్ట్ చేసేవారు కావడం సంతోషకరం. ఎవరైనా మా రాష్ట్రానికి అతిథిగా వచ్చినప్పుడు వారికి మా ప్రేమానురాగాలు చూపించడంలో ముందుంటాము. ఈ చిత్ర బృందానికి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు అందరికీ నా ధన్యవాదాలు" అన్నారు. 
 
హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ, "అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నేను పుష్ప శ్రీవల్లి ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది అని నేను చెప్పగలను. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను" అన్నారు. 
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ... "బీహార్ అందిస్తున్న ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఇదే తొలిసారిగా బీహార్ రావడం. పుష్ప ఎవరి దగ్గర తగ్గడు, కానీ మొదటిసారి మీ ప్రేమానురాగాలు ముందు తగ్గుతున్నాడు. పుష్పం అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, ఇప్పుడు వైల్డ్ ఫైర్. నా అభిమానులు ఈ ఈవెంట్లో ఏమైనా చిన్నపాటి తప్పులు చేసి ఉంటే దయచేసి క్షమించండి. పుష్ప 1కు మీ ప్రేమను అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోనే ఎంతగా ఎదురు చూస్తున్నా సినిమాగా "పుష్ప 2'' ఉండటం, ఆ చిత్రంలో నేను ఒక భాగం కావడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం ఇంతటి విజయం కావడానికి ముఖ్య కారణం ప్రేక్షకులే. ప్రేక్షకులు అందరికీ 'పుష్ప' చిత్ర బృందం తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్‌కు, బీహార్ పోలీసులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. 'పుష్ప 2' ట్రైలర్ కార్యక్రమం పాట్నాలో జరగడం నాకు ఎంతో గర్వకారణంగానూ, ఆనందంగా ఉంది ఈ చిత్రం డిసెంబరు 5వ తేదీన మీ ముందుకు రాబోతుంది" అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక