Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

Advertiesment
vizag

సెల్వి

, శుక్రవారం, 15 నవంబరు 2024 (20:48 IST)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి-సంక్షేమం తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. రాష్ట్రం పురోగతి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కూటమి సర్కారు హయాంలో ప్రధాన కంపెనీల నుండి పెద్ద పెట్టుబడులను చురుకుగా ఆకర్షిస్తోంది. 
 
ఈ మధ్య కాలంలో టాటా, రిలయన్స్ వంటి వ్యాపార దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పెట్టుబడులను ప్రకటించడం మనం చూశాం. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ విశాఖపట్నం సమీపంలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది.
 
వివరాల్లోకి వెళితే, అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో ఎన్‌టీపీసీ గ్రీన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ హబ్‌ను నిర్మించనుంది. నవంబర్ 29న ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
 
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ జెన్‌కో సహకారంతో ఎన్‌టీపీసీ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం 84,700 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో దాదాపు 25,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా.
 
ఈ హబ్ ప్రతిరోజూ 1200 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 20 గిగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?