Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (22:02 IST)
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా జంటగా నటించిన "పుష్ప-2" చిత్రం ఈ నెల 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. భారత్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన బెనిఫిట్ షోలు డిసెంబరు 4వ  తేదీ రాత్రి నుంచే ప్రదర్శించనున్నారు. అలా మొత్తం 80 దేశాల్లో ఆరు భాషల్లో 55 వేల ఆటలను ప్రదర్శించనున్నారు. 
 
అలాగే, ఈ చిత్రం ప్రీరిలీజ్ వ్యాపారంలో కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. రూ.670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇకపోతే, ఆడియో, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో మరో రూ.400 కోట్ల మేరకు వ్యాపారం జరిగింది. 
 
టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ఊ చిత్రం రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా ఒక మిలియన్ టిక్కెట్స్ అమ్ముడైన చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ టిక్కెట్లన్నీ కేవలం బుక్ మై షోలో అమ్ముడు పోవడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో అయితే, బుకింగ్ తెరిచిన తొలి అర్థగంటలోనే టిక్కెట్స్ అన్నీ అమ్ముడు పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments