Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి - విజయ్ మూవీ ఎంతవరకు వచ్చింది?

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (22:27 IST)
పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సంచ‌ల‌న క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. అక్క‌డ ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు చుంకీ పాండే కుమార్తె అన‌న్యా పాండే నాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ చిత్ర బృందం 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోగా, వాటిలో రెండు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా ఉన్నాయి. 
 
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌న్యా పాండే, రోణిత్ రాయ్‌, అలీ త‌దిత‌రుల‌పై ముఖ్య‌మైన స‌న్నివేశాలు తీశారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమాని బ‌డ్జెట్ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా భారీ స్థాయిలో పూరి క‌నెక్ట్స్, ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. అత్యంత ఆస‌క్తిక‌రమైన‌ ఈ క్రేజీ కాంబినేష‌న్ సినిమాకు విష్ణుశ‌ర్మ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ఇదివ‌ర‌కు పూరి జ‌గ‌న్నాథ్ ఫిల్మ్ ‘ఇద్ద‌ర‌మ్మాయిల‌తో..’ స‌హా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేసి మంచి పేరు సంపాదించుకున్న కెచ్చా.. స్టంట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
 
పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ స‌హ నిర్మాణంలో త‌యార‌వుతున్న ఈ యాక్ష‌న్ ఫిల్మ్‌ను పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా క‌లిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు తాజా షెడ్యూల్‌ను ముంబాయిలో ప్లాన్ చేసారు. ఆ తర్వాత విదేశాల్లో జరిపే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ మూవీని  ఎప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments