Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ దేవరకొండ కోసం రూ. 5 కోట్లతో సెట్, పూరీ జగన్నాథ్ స్కెచ్ ఏంటో?

Advertiesment
Vijay Devarakonda
, గురువారం, 13 ఫిబ్రవరి 2020 (22:15 IST)
వరల్డ్ ఫేమస్ లవర్
తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. కెరీర్ ఆరంభంలోనే చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన విజయ్ పెళ్లి చూపులుతో హీరోగా మారాడు. మొదటి సినిమాలోనే చక్కని నటనను కనబరిచి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి హిట్లతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇలా అతడి రేంజ్ కూడా పెరిగిపోయింది.  
 
విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అని వార్త బయటకు రాగానే.. అప్పుడే దానిపై అంచనాలు పెరిగిపోయాయి. తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్‌గా చూపించే పూరీ.. ఇందులో విజయ్‌ను ఎలా చూపించబోతున్నాడో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
 
ఈ సినిమాను మొదట పూరీ జగన్నాథ్, చార్మీ భాగస్వామ్యంలో నిర్మించాలని అనుకున్నారు. అయితే, ఈ సినిమా స్క్రిప్ట్ చూసిన తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా చేరారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్‌కు మారింది. దీంతో ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు.
 
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇందుకోసం కియారా అద్వాణీ, జాన్వీ కపూర్ సహా ఎంతోమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే, ఆలియా భట్, అనన్య పాండే పేర్లను పరిశీలించారు. కానీ, ఎవరినీ ఫైనల్ చేయలేదని అంటున్నారు. దీంతో ఇది చిత్ర యూనిట్‌కు పెద్ద టాస్క్ అయింది.
 
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ఫైటర్ అనే టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేయించాడు పూరీ జగన్నాథ్. అయితే ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీగా మారడంతో టైటిల్ కూడా మారుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీకి లైగర్ అనే పేరు ఫిక్స్ చేశారట. ఈ టైటిల్ కొత్తగా ఉండటంతో చర్చనీయాంశం అవుతోంది.
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.  ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమాలో వచ్చే పది నిమిషాల సీన్ కోసం అక్కడ 5 కోట్లతో సెట్ వేశారట. విజయ్ జాయిన్ అయిన వెంటనే ఆ సెట్‌లో షూటింగ్ మొదలు పెడతారనే టాక్ వినిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమికుల రోజు కానుకగా భీష్మ నుంచి సింగిల్స్ యాంథమ్