Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌రీష్ శంక‌ర్‌కి షాక్ ఇచ్చిన పూరి...ఇంత‌కీ ఏం చేసాడు..?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (11:43 IST)
డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన తాజా చిత్రం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్. మెగా హీరో వ‌రుణ్ తేజ్ - పూజా హేగ్డే కాంబినేష‌న్ లో రూపొందిన ఈ భారీ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. సెకండ్ వీక్ స‌రైన సినిమా లేక‌పోవ‌డంతో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రింత‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం ఖాయం అనుకున్నారు. అయితే... ఊహించ‌ని విధంగా పూరి.. హ‌రీష్ శంక‌ర్ కి షాక్ ఇచ్చాడు.
 
ఇంత‌కీ ఏం చేసాడంటే.. ఈ నెల 28న డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పుట్టిన రోజు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బ‌ష్ట‌ర్ అయ్యింది. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంక‌ర్ రూ.75కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 
 
మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మాస్ బీట్స్ ఈ మూవీ విజయంలో కీలకపాత్ర పోషించాయి. పూరి తన పుట్టిన రోజు సందర్భంగా ఇస్మార్ట్ శంక‌ర్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఇది గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌కి దెబ్బే. ఎందుకంటే..? ఇప్పుడు మార్కెట్‌లో మాస్ సినిమాలు లేవు. 
 
ఉన్న‌ది గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమానే. దీనికి పోటీగా ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ చేస్తుండ‌డంతో హ‌రీష్ శంక‌ర్ షాక్ అయ్యాడ‌ట‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ సెంట‌ర్స్ లో ఇస్మార్ట్ శంక‌ర్ ని రిలీజ్ చేస్తున్నార‌ట‌. మ‌రి... ఈసారి ఇస్మార్ట్ శంక‌ర్ ఏ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments