Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ కాక‌పోతే ఇంకొక‌రు.. ఆ సినిమా మాత్రం ఆగ‌దు - పూరి..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఆకాష్ పూరి, నేహాశెట్టి జంట‌గా న‌టించిన మెహ‌బూబా చిత్రం ఈనెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుక

Webdunia
సోమవారం, 7 మే 2018 (18:57 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఆకాష్ పూరి, నేహాశెట్టి జంట‌గా న‌టించిన మెహ‌బూబా చిత్రం ఈనెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా పై బిగినింగ్ నుంచి పాజిటివ్ టాక్ ఉండ‌డం.. దీనికితోడు దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తుండ‌టంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా విజ‌యం సాధిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. 
 
ఇదిలాఉంటే... ఈ చిత్రం  ప్రమోషన్లో పూరి బిజీగా ఉన్నారు. తాజాగా, మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో తాను మహేష్ బాబు హీరోగా తలపెట్టిన 'జనగణమన' చిత్రాన్ని ప్రస్తావించారు. మహేష్‌తో 'బిజినెస్ మేన్' తీసిన తరువాత 'జనగణమన' ప్లాన్ చేశానని, అయితే, మహేష్ ఏమీ తేల్చలేదని పూరీ చెప్పారు. ఈ సినిమాను మహేష్ కాక‌పోతే... మరో హీరోతో ఈ సినిమాను ఖ‌చ్చితంగా తీస్తానని అన్నారు. 
 
సమాజానికి ఇటువంటి చిత్రం ఎంతో అవసరమని, అత్యాచార ఘటనలు విన్నా, చూసినా తనకెంతో బాధకలుగుతుందన్నారు.  ఈ దేశం ఎలా పోతుందో అర్థం కావడం లేదనిపిస్తుందనీ, భారతావని సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలన్నదే 'జనగణమన' స్టోరీలైన్ అని చెప్పారు. 
 
ఈ మూవీని వెంకీతో పూరి తీయ‌నున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి... జ‌న‌గ‌ణ‌మ‌నలో మ‌హేష్ న‌టిస్తాడా..? వెంకీ న‌టిస్తాడా..? వీరిద్ద‌రూ కాకుండా మ‌రో హీరో న‌టిస్తాడో..? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments