Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైరిస్క్ తీసుకున్న పూరీ.. ఇంటిని విక్రయించి సినిమా తీశాడట...

టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. అలాంటి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో నిర్మించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకు

Webdunia
సోమవారం, 7 మే 2018 (16:32 IST)
టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. అలాంటి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో నిర్మించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
 
ఈ చిత్రంలో తన తనయుడు ఆకాశ్ పూరీ హీరో కాగా, తానే నిర్మాత దర్శకుడిగా పని చేశారు. అయితే, ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ఆయన తనకు గల ఇళ్లలో నుంచి ఒక ఇంటిని అమ్మేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. 
 
ఇదే విషయాన్ని పూరీ వద్ద తాజాగా ప్రస్తావించగా, 'మెహబూబా' సినిమా కోసం ఇల్లు అమ్మేసిన మాట నిజమేనని చెప్పాడు. కొత్త కుర్రాడిపై డబ్బులు ఖర్చు చేయడానికి ఏ నిర్మాతైనా ఆలోచిస్తాడు.. ఒకవేళ ముందుకు వచ్చినా అనేక ఆంక్షలు ఉంటాయి. 
 
అందువల్ల అలాంటివి ఉండకూడదనే నేను ఒక ఇల్లు అమ్మేశాను. ఈ సినిమా కంటెంట్ మీద . ఆకాశ్ మీద నాకు నమ్మకం వుంది.. అందుకే అలా చేశాను. ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను .. ఏదైనా తిరిగి సంపాదించుకోవడమెలాగో నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments