థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
బుధవారం, 10 మే 2023 (09:10 IST)
ప్రముఖ కమెడియన్, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్విరాజ్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి  తరలించి సెలైన్ ఎౕక్కించారు. అయితే, ఆస్పత్రిలో ఎందుకు చేరారన్న విషయంపై క్లారిటీ లేదు. 
 
పృథ్విరాజ్‌ను ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్‌పై చూడగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కంగారుపడిపోయారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆస్పత్రి పడకపై నుంచే పృథ్వీరాజ్ ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
 
"దర్శకుడిగా తొలిసారి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. కొత్త రంగుల ప్రపంచం అనే మూవీకి మీ ఆదరణ కావాలి.ఈ నెల 26వ తేదీన పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. సెలైన్‌తో ఉన్నా సినిమా గురించే ఆలోచిస్తున్నాం. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకు, మా బృందానికి మీ సపోర్టు ఉండాలి" అని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments