Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆస్కార్ రేసు'లో ఆకాశమే నీ హద్దురా..

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:22 IST)
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ఆకాశమే నీ హద్దురా (తమిళంలో సూరరై పోట్రు). ఈ చిత్రం కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీలో రిలీజై కోట్లాది రూపాయల మేరకు కలెక్షన్లు రాబట్టింది. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎయిర్‌ డెక్కన్‌ అధినేత కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. 
 
670 పేజీలుండే 'సింప్లీ ఫ్లై' బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకురాలు/దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్‌ రేసులో నిలిచిన‌ట్టు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. 
 
తాజాగా  ఆస్కార్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల తుది జాబితాని ప్ర‌క‌టించ‌గా, ఇందులో మ‌న దేశం నుండి సూర‌రై పోట్రు నిలిచింది. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు గ‌ర్వంగా చెప్పుకుంటున్నారు. తుది జాబితాలోని విజేత చిత్రాలను వచ్చే మార్చ్ 15న ప్రకటించనున్నారు. మార్చి 5 నుండి 10 మ‌ధ్య అకాడ‌మీ వారు ఓటింగ్ నిర్వ‌హించి విజేత‌ల‌ను తెలియ‌జేయ‌నున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments