Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

దేవీ
మంగళవారం, 5 ఆగస్టు 2025 (15:16 IST)
Producers meet at Chamber
గత మూడురోజులుగా సినీమారంగంలోని 24 క్రాఫ్ట్ కు చెందిన కార్మికులు వేతనాల విషయంలో 30 శాతం పెంపుదల వుండాలని కార్మికులు ఆయా శాఖాల నాయకులను కోరారు. కానీ అది సాధ్యం కాదనీ ఇప్పటికే ఇతర సినీరంగాల్లోకంటే మన దగ్గర ఎక్కువ ఇస్తున్నామని నిర్మాతలు తేల్చి చెప్పారు. గతంలో ఏడాదికి 10 శాతం కార్మికుల వేతనం పెంచాలని 24క్రాఫ్ట్ నాయకులు ఫిలింఛాంబర్ కు ప్రతిపాదన చేశారు. అలా చేసినా ఏడాదికేడాది నిర్మాతకు బరువు అవుతుందని చెప్పారు. 
 
కానీ షడెన్ గా గత మూడు రోజులుగా సినీకార్మికుల నాయకుల స్వలాభపేక్షతో నిన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ షూటింగ్ జరిగే ప్రాంతంలో కొందరు కార్మికులు మాకు న్యాయం కావాలని నినాదాలు చేశారు. ఇక నేడు ఫిలింఛాంబర్ పెద్దలు, కార్మిక నాయకులు, లేబర్ ఆఫీసర్ ల మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ సారాంశం ప్రకారం కొద్దిసేపటి క్రితమే ఛాంబర్ నుంచి నిర్మాతల అబిప్రాయం బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె కి మద్దతుగా విధులకు హాజరు కానీ వారిని మినహాయించి, ఎవరైతే, జరుగుతున్న షూటింగ్ లు ఆపుతూ అంతరాయం కలిగిస్తున్నారో, అలాగే ఆ షూటింగ్ లకు హాజరు అవుతున్న సభ్యులను బెదిరిస్తూ, షూటింగ్ లకు రాకుండా అడ్డుకుంటున్నారో  వారిని మాత్రం భవిష్యత్తులో జరిగే షూటింగ్ లకు ఆ సభ్యులను తీసుకోకూడదని  నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments