Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు సాయి రాజేష్‌కి గిఫ్టుగా ఇచ్చిన నిర్మాతలు

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (09:43 IST)
ఇటీవలే 68వ జాతీయ సినిమా అవార్డులలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో ‘కలర్ ఫోటో’ చిత్రానికిగాను జాతీయ అవార్డు అందుకున్నారు కథ రచయిత, దర్శకుడు సాయి రాజేష్. 2020 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం సాయి రాజేష్ "బేబీ" అనే తెరకెక్కిస్తున్నారు.   
 
యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 
న్యూ ఏజ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది. 
 
ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన పోస్టర్స్ "బేబి" అంచనాలను పెంచాయి. త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ మరియు టీజర్ రిలీజ్ కానుంది. ఆ తరువాత అధికారికంగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు.  
 
"బేబీ" చిత్రం రష్ చూసిన నిర్మాతలు ఎస్.కే.ఎన్, మారుతిలు దర్శకుడు సాయి రాజేష్‌కు ఎం.జి.హెక్టార్ కారును బహుమతిగా అందించారు. చెప్పిన కథను అలానే అద్భుతంగా తెరకెక్కించినందుకుగాను ఆనందంతో ఈ బహుమతిని అందించారు. 
 
మాములుగా సినిమా రిలీజై విజయవంతం అయిన తర్వాత గిఫ్టులు ఇస్తుంటారు. కానీ రిలీజ్‌కు ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా గిఫ్ట్ ఇవ్వడం అనేది అరుదుగా జరుగుతుంది. 
 
ఏదేమైనా ఈ సినిమాపై నిర్మాత ఎస్ కె ఎన్ మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ రోజుల్లో, టాక్సీవాలా, మంచి రోజులొచ్చాయి లాంటి చిత్రాలతో హిట్ అందుకున్న ఎస్.కె.ఎన్ ఈ సారి "బేబీ" చిత్రంతో కూడా హిట్ అందుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments