రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 'ఆదిపురుష్' సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా సదరు సంస్థ కోర్టును కోరింది.
ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్రభాస్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభాస్‌తో పాటు 'ఆదిపురుష్' చిత్ర యూనిట్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.