సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా సెంట్రల్ చీఫ్ ఎలక్షన్స్ కమీషనర్ కు, అలాగే తెలంగాణ చీఫ్ ఎలక్షన్స్ కమీషనర్ కు, కేంద్ర హోమ్ శాఖకు వ్యూహం సినిమాను ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల తెలంగాణాలో విడుదల కాకుండా నిలుపుదల చేయాలని ఇచ్చిన పిర్యాదు సారాంశం.
పాపులర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు రూపొందించిన పొలిటికల్ న్యూ మూవీ "వ్యూహం" నవంబర్ 10వ తేదీన విడుదల కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా, ఇతర ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా రూపొందించిన ఈ పొలిటికల్ సినిమా విధులకు ముందే వివాదాస్పదం కావడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతోంది. అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన దాసరి కిరణ్ కుమార్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూర్తి అధికార పార్టీ అండదండలతో ఈ సినిమా తెరకెక్కింది. దాంతో ఈ సినిమా పూర్తిగా వన్ సైడ్ గా వారికి అనుకూలంగా, రూపొందించారు. ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీ వారి పాత్రలను వ్యంగంగా చిత్రీకరించి తక్కువ చేసి చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ (వెల్ నోన్ హీరో) గారు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధి గారు, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తదితరుల పాత్రలకు పోలికలు దగ్గరగా ఉన్న డూప్ ఆర్టిస్టులను పెట్టి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందుగా ఇటీవల విడుదల చేసిన "వ్యూహం" సినిమా ట్రైలర్ వివాస్పదంగా మారింది.
దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇటీవల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. పూర్తి పొలిటికల్ కథతో కేవలం అధికార పార్టీని అనగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, ఆయనను పాజిటివ్ గా చూపిస్తూ, ఇతర నాయకులను తక్కువగా చేసి చూపిస్తూ తీసిన ఈ సినిమా ప్రభావం ప్రస్తుతం జరగబోయే తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఓటర్లపైన కూడా ఎంతో ఉండనుంది. పై పెచ్చు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, బి.ఆర్.ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీల మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ ఎన్నికలలో కూడా పోటీ చేయబోతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలు కు సంబందించిన అంశాలు కూడా ఈ సినిమాలో పెట్టారు. గతంలో అనగా 2019వ సంవత్సరంలో రాంగోపాలా వర్మ రూపొందించిన పొలిటికల్ సినిమా "లక్ష్మీస్ ఎన్ .టి ,ఆర్" ను కూడా ఎలక్షన్ కోడ్ సమయంలో రిలీజ్ చేయాలని ప్రయత్నించగా ఎలక్షన్ కమీషన్ ఆ సినిమా విడుదలను ఆపివేసింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నప్పటికీ, "లక్ష్మీస్ ఎన్ .టి ,ఆర్" సినిమాను ఒక ఉదాహరణగా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. దానికి సంబందించిన ECI Order dated 10.04.2019 bearing Ref No.437/6/CG/ECI/LET/FUNCT/MCC/2019 (ANNEXED HEREWITH AS ANNEXURE -1. 2. ECI Order no. 491/MM/Comm dated 10.04.2019 ను పరిశీలించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటర్లపై ఎంతో ప్రభావం చూపనున్న ఈ సినిమా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ సమయంలో తెలంగాణాలో విడుదలైతే,శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కొందరిని డూప్ పాత్రలలో తక్కువ చేసి చూపిస్తుండటం వల్ల ఓటర్లపై కూడా ప్రభావం ఉంటుంది. దయచేసి వ్యూహం సినిమా విడుదలను ఎలక్షన్స్ పూర్తయ్యేంతవరకు ఆపాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.