Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజయ్ ప్రధాన పాత్రలో మర్డర్ మిస్టరీ చిత్రం గా చక్రవ్యూహం సిద్ధం

Advertiesment
Chakravyuham team
, మంగళవారం, 30 మే 2023 (18:42 IST)
Chakravyuham team
విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్  ప్రధాన పాత్రలో నటిస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం "చక్రవ్యూహం’ -ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన చెట్కూరి మధుసూధన్ మీడియా రిలీజ్ ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాలను పంచుకున్నారు. సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై  శ్రీమతి. సావిత్రి గారు "చక్రవ్యూహం" ని నిర్మించారు.
 
డైరెక్టర్ మధుసూధన్ మాట్లాడుతూ మా "చక్రవ్యూహం" చిత్ర  ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తుచేసుకొని  ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే విడుదల అయినా టీజర్ కి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది అని థియేటర్స్ లో కూడా ఇదే విధంగా ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు. ట్రైలర్ విడుదల చేసిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది ఈ చిత్ర ట్రైలర్. ప్రేక్షకులు అందరిని జూన్ 2 న థియేటర్స్ లోనే సినిమా చూసి ఆదరించాలని కోరారు.
 
క్రైమ్ థ్రిల్లర్ గా  తెరకెక్కిన చిత్రం లో అజయ్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన మాట్లాడుతూ, మధుసూధన్ గారు సినిమాని తీసిన తీరు  తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చారు. స్క్రీన్ ప్లే, కథ పై తనకి ఉన్న కమాండ్ బట్టే చెప్పచు మధుసూధన్ గారు తన కథని ఎలా సిద్ధం చేసారో అని అన్నారు. సినిమా అందరికి నచ్చుతుందని  బాగా వచ్చిందని ప్రతి ఒక్కరు తమ సినిమాని జూన్ 2 న థియేటర్స్ కి వచ్చి చూడమని కొత్త దర్శకులని ఎంకరేజ్ చేయమని అన్నారు.
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా  హక్కులని  మైత్రీ  మూవీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్ రెడ్డి కొనుగోలు చేసారు. ఆయన మాట్లాడుతూ కథ వినగానే నచ్చి  కొనడం జరిగింది అన్నారు. ఇప్పడు డైరెక్టర్ గారు తీసిన సినిమా చూసాక 100 శాతం సక్సెస్ అవుతుందని చెప్పారు. నేటి కాలం యువ దర్శకులదే అని మంచి మంచి కంటెంట్స్ తో వస్తున్నారని అలాంటి వారికి అవకాశాలు ఇవ్వడానికి ఇండస్ట్రీ ఎప్పడూ రెడీగా  ఉంటుందని మరియూ ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని అన్నారు. జూన్ 2 న గ్రాండ్ గా  రిలీజ్ చేస్తున్న మా "చక్రవ్యూహం" చిత్రాన్ని థియేటర్స్ లో చూసి విజయవంతం చేయాలని  కోరారు. శశిధర్ రెడ్డి గారి చేతులు మీదగా చిత్ర యూనిట్ అంతా  కలిసి బిగ్ టికెట్ ని ఆవిష్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు శిరీష్ చిత్రం బడ్డీ ఆసక్తికరమైన ఫస్ట్ లుక్