టాలీవుడ్‌లో విషాదం - నిర్మాత రామకృష్ణారెడ్డి కన్నుమూత

Webdunia
గురువారం, 26 మే 2022 (10:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి (76) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. చెన్నైలోని వలసరవాక్కంలో బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
కాగా, ఈయన దాదాపు 15కుపైగా తెలుగు చిత్రాలను నిర్మించారు. అలాంటి వాటిలో 'అల్లుడు గారు జిందాబాద్', 'అభిమానవంతులు', 'వైకుంఠపాళి', 'మూడిళ్ళ ముచ్చట', 'అగ్నికెరటాలు' వంటి అనేక చిత్రాలను నిర్మించారు. కాగా రామకృష్ణారెడ్డి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
ఈ సందర్భంగా చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, రామకృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. 
 
కాగా, 1948 మార్చి 8వ తేదీన నెల్లూరు జిల్లా గూడూరులో మస్తానమ్మ, సుబ్బరామిరెడ్డి దంపతులకు జన్మించారు. మైసూరు యూనివర్శిటీలో బీఈ పూర్తి చేసిన ఈయన కొంతకాలం రేకుల వ్యాపారం కూడా చేశారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత, తమ బంధువు ఎంఎస్ రెడ్డి ప్రోత్సాహంతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. 1973లో శోభానాయుడు, ఫటాఫట్ జయలక్ష్మిలను పరిచయం చేస్తూ అభిమానవంతులు అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది సక్సెస్ కావడంతో సినీ పరిశ్రమలో స్థిరపడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments