తెలంగాణలో కల్లు, మటన్ కే వైబ్ ఉంటుంది. సినిమాలను ఆ తర్వాతే ప్రాధాన్యత అన్న దిల్ రాజు వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తావా అంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. అయితే ఈ వ్యవహారంపై దిల్ రాజు మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో పెద్దగా సినిమా ఈవెంట్స్ నిర్వహించమన్నారు.
కానీ అప్పట్లో ఫిదా సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాము. తాజాగా ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్ నిర్వహించాము. ఒక తెలంగాణ వాసిగా అందులో నిజామాబాద్ వాసిగా తనకు పుట్టిల్లు.. ఆ జిల్లా వాసిగా అక్కడ తన సినిమా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈవెంట్ నిర్వహించాము.
అక్కడ నేను మాట్లాడిన కొన్ని మాటలను సోషల్ మీడియాలో కావాలనే వక్రీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చర్‌లో భాగం అయిన మటన్, కల్లు గురించి సంభోదించానన్నారు. సినిమాలతో బిజీగా మన తెలంగాణ కల్చర్ అయిన దావత్ ను మిస్ అవుతున్నాను. రెండు సినిమాలు విడుదలైన తర్వాత దావత్ చేసుకొంటానన్నారు.
మన సంస్కృతి నేపథ్యంలో తాను రూపొందించిన బలగం మూవీని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. అన్నీ రాజకీయ పార్టీలు ఈ చిత్రాన్ని అభినందించాయి. బాన్సువాడలోనే ఫిదా సినిమాను తెరకెక్కించాం. ఆ చిత్రం తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసింది. తెలంగాణ వాసిగా తాను ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తాను? అంటూ ప్రశ్నించారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.