కెరీర్ కోసం అన్నింటినీ భరించా.. ఒప్పుకున్నా.. బాలీవుడ్ హీరోయిన్

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (11:02 IST)
తన సినీ కెరీర్ బాగుండాలని అన్నింటినీ భరించడమేకాకుండా అంగీకరించినట్టు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో తనకు ఎదురైన అనుభవాలను `అన్‌ఫినిష్డ్` అనే పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. 
 
ఇందులో కెరీర్ ఆరంభంలో తానెదుర్కొన్న అవమానాలను, బాలీవుడ్ ప్రముఖులు ఆగడాలను ప్రియాంక ఈ పుస్తకం ద్వారా వెల్లడించింది. రొమాంటిక్ సాంగ్ కోసం ఓ డైరెక్టర్ తననులో దుస్తులతో కనిపించమన్నాడని, తీరైన శరీరాకృతి కోసం సర్జరీ చేయించుకోమని మరో డైరెక్టర్ సూచించాడని ఆ పుస్తకంలో ప్రియాంక పేర్కొన్న విషయాలు సంచలనంగా మారిన విషయం తెల్సిందే.
 
అయితే, ఆ పుస్తకంలో తాను చేసిన ఆరోపణల గురించి తాజాగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. 'ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినీ పరిశ్రమలోనే ఉండాలనుకున్నా. అందుకే అన్నింటినీ భరించా. ఎవరికీ నా ఇబ్బందుల గురించి చెప్పలేదు. ఎన్నో కష్టాలను ఓర్చుకున్నా. పరిశ్రమలో నిలదొక్కుకోవడం కోసం చిరునవ్వుతో అన్నింటినీ భరించా. అప్పట్లో నాకెన్నో భయాలుండేవి. అభద్రతా భావం ఎక్కువగా ఉండేది. అందుకే ఎవరేమి అన్నా అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించాన'ని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments