Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: పాక్ నటులపై నిషేధాన్ని కడిగేసిన ప్రియాంకా చోప్రా

పాకిస్థాన్ నటులపై నిషేధం విధించడంపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తీవ్రంగా ఖండించారు. కేవలం పాక్ సినీ నటులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (09:39 IST)
పాకిస్థాన్ నటులపై నిషేధం విధించడంపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తీవ్రంగా ఖండించారు. కేవలం పాక్ సినీ నటులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక మాట్లాడుతూ... 'యూరీ సెక్టార్‌పై దాడి జరిగితే పాక్ నటులు ఏం చేశారు?' అని నిలదీసింది. 
 
ఎవరో చేసిన పనికి పాక్ నటులను శిక్షించడం ఎందుకు? అని అడిగింది. ఈ విధానం సరికాదని, ఇది తప్పు అని స్పష్టం చేసింది. 'సినీ నటులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పాక్ నటులే మీకు కనపడ్డారా? పాక్ వైద్యులు, బిజినెస్‌ మెన్‌, రాజకీయ నాయకులను ఎందుకు వేలెత్తి చూపడం లేదు?' అని నిదీసింది. 
 
కేవలం యూరీ ఘటనే కాదని, దేశంలో ఏ చిన్న సమస్య తలెత్తినా మొదట నటులు, కళాకారులనే లక్ష్యం చేసుకుంటున్నారని మండిపడింది. ఎందుకిలా చేస్తున్నారు? అని అడిగిన ప్రియాంకా చోప్రా...గాంధీజీ నడిచిన మన దేశంలో అహింసకు కట్టుబడి ఉన్నామని నీతి సూత్రాలు వల్లె వేసింది. చేయాల్సిన పనులను మర్చిపోయి, అనవసరమైన వాటిపైనే ఎక్కువగా శ్రద్ధపెడుతున్నారని, వాటి గురించే చర్చిస్తుంటారని ప్రియాంకా చోప్రా తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments