Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ముందు కాలిపై కాలేసుకుని కూర్చొన్న ప్రియాంకా.. 'లెగ్స్ ఫర్ డేస్' అంటూ ట్వీట్

జర్మన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు కాలుపై కాలు వేసుకుని బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండ

Webdunia
బుధవారం, 31 మే 2017 (12:48 IST)
జర్మన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు కాలుపై కాలు వేసుకుని బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న వేళ, తన కాళ్లు చూపిస్తూ, కాలిపై కాలు వేసుకుని కూర్చోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
 
ప్రస్తుతం తన చిత్రం 'బేవాచ్' ప్రమోషన్ కోసం బెర్లిన్‌లో ఉన్న ప్రియాంక, మోదీని కలసి ఓ చిత్రాన్ని పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీకి ఎంతమాత్రమూ గౌరవం ఇవ్వకుండా ఆమె ప్రవర్తించిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై ప్రియాంకా చోప్రా ధీటుగా స్పందించారు.
 
తన తల్లితో కలసి కూర్చున్న చిత్రాన్ని పోస్టు చేస్తూ, "లెగ్స్ ఫర్ డేస్" అని ఒకే ఒక్క మాటతో విమర్శకుల నోళ్లు మూయించింది. ప్రియాంక పోస్టు చేసిన ఫోటోలో, ఆమె తల్లి మధు చోప్రా, ప్రియాంక కన్నా పొట్టి దుస్తులతో ఉండగా, తన తల్లితో ఉండేలాగానే, మోడీ వద్దా ప్రవర్తించానన్న భావన వచ్చేలా ఆమె పెట్టిన పోస్టు విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. పైగా, ఈ ఫోటోను 2.80 మంది లైక్ చేయడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

బ్యాంకాక్ భూకంపం నుంచి తప్పించుకుని ప్రాణాలతో తిరిగొచ్చిన ఎమ్మెల్యే ఫ్యామిలీ!

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments