Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలలోపు ప్రియాంక చోప్రాకు నిశ్చితార్థం.. వరుడెవరో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోతున్నారు. నిన్నటికి నిన్న..అందాల సుందరి అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తరుణంలో.. మరో బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌వీర్ సింగ్ త్వరలోనే పెళ్ల

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (11:23 IST)
బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోతున్నారు. నిన్నటికి నిన్న..అందాల సుందరి అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తరుణంలో.. మరో బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌వీర్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా కూడా పెళ్లికి రెడీ అయిపోయిందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇందులో భాగంగా ప్రియాంక చోప్రాకు మరో నెలలోనే నిశ్చితార్థం జరుగబోతోందని ఓ ఆంగ్లపత్రిక వార్తను ప్రచురించింది. హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనస్‌తో ప్రియాంక ప్రేమలో ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తగ్గట్టు ప్రియాంక కూడా ఆయనతో కలిసి వివిధ ప్రదేశాల్లో కనిపిస్తున్నారు. 
 
ఇటీవల ఆమె నిక్‌ కుటుంబ సభ్యుల పెళ్లికి వెళ్లారు. రెండు రోజుల క్రితం ఆయన్ను ముంబయి తీసుకొచ్చారు. ఓ హోటల్‌లో ప్రియాంక కుటుంబం నిక్‌తో కలిసి కనిపించింది. దీంతో ఆమె ప్రేమలో ఉన్న విషయం నిజమేనని, త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరుగనుందని టాక్. 
 
ఇదే విషయం గురించి ప్రియాంక తల్లి మధు చోప్రాను ప్రశ్నించగా.. ఇప్పుడే నిక్‌ను కలిశానని, అప్పుడే ఓ అభిప్రాయానికి రావడం కష్టమని చెప్పారు. ప్రస్తుతం ప్రియాంక, నిక్‌ గోవాలో ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో ప్రియాంక చోప్రా నిశ్చితార్థం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments