Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు 36.. అతడికి 25... ముగిసిన నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి...

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. డేటింగ్ చేస్తున్న హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనాస్‌తో ఆమె నిశ్చితార్థం జరిగిపోయింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమం లండన్‌లో ముగిసింది.

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (14:12 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. డేటింగ్ చేస్తున్న హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనాస్‌తో ఆమె నిశ్చితార్థం జరిగిపోయింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమం లండన్‌లో ముగిసింది. వారం క్రితం ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా నిక్ ప్రియాంకా వేలికి ఉంగరం తొడిగినట్టు 'పీపుల్' మేగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా మీడియాలో సైతం ఈ సెలబ్రిటీ ఎంగేజ్‌మెంట్‌ని నిర్థారిస్తూ పలు కథనాలు వచ్చాయి.
 
నిశ్చితార్థం సజావుగా జరగడంతో ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారని పెళ్లి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రియాంక చోప్రా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించినపుడు ఆమె వేలికి వజ్రపు ఉంగరం కనిపించింది. కెమెరాలు తనపై ఫోకస్ చేయగానే పీసీ తన ఉంగరాన్ని దాచేందుకు ప్రయత్నించింది. అది చూసినప్పటి నుంచి నిశ్చితార్థం జరిగిపోయిందనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అదే నిజమైందని పేజ్ త్రీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇక త్వరలోనే చోప్రాల ఇంటిలో పెళ్లి బాజాలు మోగుతాయని తెలిసింది. 
 
ఇదిలావుంటే, సల్మాన్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా 'భారత్' అనే చిత్రంలో నటిస్తోంది. ఆగష్టు 10వ తేదీ నుంచి ప్రియాంక చోప్రా ఈ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నది. కానీ, ఉన్నట్టుండి ప్రియాంక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని భారత్ సినిమా దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించాడు. ప్రియాంక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నదని, ఈ కారణంగానే ప్రియాంక ఈ సినిమా నుంచి తప్పుకుందని ఆయన తెలిపాడు. ప్రియాంక చోప్రాకు అలీ అబ్బాస్ జాఫర్ తెలియజేశారు. ప్రియాంకకు, నిక్‌కు నిశ్చితార్థం జరిగిపోయినట్టు అమెరికా మీడియా పేర్కొనడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments