Webdunia - Bharat's app for daily news and videos

Install App

మై డియర్ ఫ్యాన్స్... కాస్త ఓపిక పట్టండి... (Video)

మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆయన మూవీస్ అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇటీవలే బన్నీ నటించి

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (14:08 IST)
మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆయన మూవీస్ అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇటీవలే బన్నీ నటించిన "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" సినిమా రిలీజైంది. ఈ చిత్రం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
 
ఆ సినిమా తర్వాత బన్నీ మరే సినిమాను ప్రకటించలేదు. ఈ సారి సినిమా ప్రకటనకు కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు కూడా. తమ అభిమాన హీరో తదుపరి చిత్రం ఏంటన్న విషయమై అల్లు ఫ్యాన్స్‌లో చర్చ సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్.. తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా స్పందించాడు.
 
'మై డియర్ ఫ్యాన్స్... మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా తదుపరి సినిమా ప్రకటన గురించి ఓపికగా ఉండమని కోరుతున్నాను. ఎందుకంటే అది ఇంకాస్త సమయాన్ని తీసుకోవచ్చు. ఓ మంచి చిత్రాన్ని మీకందించాలని చూస్తున్నాను. కొంతసమయం పడుతుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పేందుకు మరింత సమయం తీసుకోనున్నాడనే విషయం ఇట్టే అర్థమైపోతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments