Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు ప‌క్క‌న శ్రీ‌లీల ప్లేస్‌లో ప్రియాంక అరుళ్

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (17:02 IST)
Mahesh Babu, Priyanka
సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప‌క్క‌న న‌టించేందుకు హీరోయిన్లు పోటీప‌డుతుంటారు. తాజాగా ఆయ‌న త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించ‌నున్న చిత్రంలో ఇప్ప‌టికే పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే ఎంపికైంది. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి లొకేష‌న్లు, సెట్‌పై ఎలా వెళ్ళాలో చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.
 
కాగా, క‌థ ప్ర‌కారం ఇంకా ఇద్ద‌రు హీరోయిన్లు అవ‌స‌రం ఏర్ప‌డింది. అందుకే శ్రీ‌లీల మ‌రో నాయిక‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం మేర‌కు మల‌యాళ భామ ప్రియాంక అరుళ్ మోహ‌న్ ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ఇప్ప‌టికే ఈమె నానితో గ్యాంగ్ లీడ‌ర్`లో న‌టించింది. త‌మిళంలో వ కార్తికేయ‌న్  క‌థానాయ‌కుడిగా న‌టించిన  `డాక్ట‌ర్`, `డాన్ చిత్రాల్లో న‌టించింది. ఇందులో ఆమె పాత్ర త‌క్కువైన మెగా బేన‌ర్ సూప‌ర్ స్టార్ హీరో క‌నుక అంగీక‌రించింద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్‌పైకి వెళ్ళ‌నుంది. ఇప్ప‌టికే సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ఆధ్వ‌ర్యంలో ట్యూన్స్ కార్య‌క్ర‌మాలు చెన్నైలో జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌నున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments