Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ సరసన ప్రియా వారియర్, ఆదివారం మొదలైంది... ఎందుకంత తొందర?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (15:15 IST)
యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నారు. ఇటీవల వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ చిత్రాన్ని ప్రారంభించి ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న నితిన్, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. నితిన్ హీరోగా, అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో, వి.ఆనందప్ర‌సాద్ నిర్మిస్తున్న‌ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు ఆదివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా జ‌రిగాయి. 
 
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన శైలితో అంద‌రినీ అల‌రించే చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్న భ‌వ్య క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా పి. వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సంస్థ కార్యాల‌యంలో జ‌రిగిన ముహూర్త‌పు స‌న్నివేశానికి చిత్ర నిర్మాత వి. ఆనంద ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి క్లాప్‌కొట్టారు. కెరీర్ పరంగా నితిన్‌కు 28వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
 
ఈ చిత్రం గురించి నిర్మాత వి. ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “యూత్‌స్టార్ నితిన్‌కి ప‌క్కాగా స‌రిపోయే క‌థతో సినిమా తీస్తున్నాం. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో హీరోగా న‌టించిన ఆయ‌న కెరీర్‌లో ఇది చెప్పుకోద‌గ్గ సినిమా అవుతుంది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటిగారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూసే ప్రేక్ష‌కుల గురించి నాకు బాగా తెలుసు. ఆయ‌న తీసుకునే పాయింట్ అంత గొప్ప‌గా, వైవిధ్యంగా ఉంటుంది. 
 
మా కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా కూడా చాలా కొత్త‌గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. కీర‌వాణిగారి సంగీతం కూడా మా సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. హీరోయిన్లుగా ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టిస్తున్నారు. ర‌కుల్ ఇంత‌కు ముందు మా సంస్థ‌లో `లౌక్యం`లో న‌టించారు. యూత్‌లో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిన ప‌నిలేదు. ఆమెను తెలుగులో మా సంస్థ ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. షూటింగ్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం“ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments